ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా.. విజయం వైఎస్ఆర్సీపీదే
ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా విజయం మాత్రం వైఎస్ఆర్సీపీదే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు జిమిక్కులను ప్రజలు నమ్మె స్థితిలో లేరన్నారు. అధికారం కోసం ఎంతకైనా దిగజారీపోయే వ్యక్తి చంద్రబాబు అన్నారు. బీసీలకు రాజ్యసభ సీటు ఇస్తే చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఓడిరచే సత్తా చంద్రబాబు, పవన్‌కు లేదన్నారు. చంద్రబాబు ఎప్పటికీ మాజీ ముఖ్యమంత్రే తప్ప మళ్లీ సీఎం కాలేరు. రాయలసీమకు చంద్రబాబు చేసింది ఏమిటి అని ప్రశ్నించారు.













