ఏపీ ప్రభుత్వానికి షాక్.. జీవో నెం 1 ను సస్పెండ్ చేసిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1ని ఈ నెల 23 వరకు సప్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెం.1ని రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతి పక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర పూరితంగా జీవో జారీ చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడిన డివిజన్ బెంచ్ కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది.













