చింతామణిని ఎలా నిషేధిస్తారు? : ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
చింతామణి నాటకం నిషేధం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. నాటకంలో పాత్రపై అభ్యంతరం ఉంటే పాత్రను తొలగించాలి కానీ నాటాకాన్ని ఎలా నిషేధిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్ని బ్యాన్ చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్ని నిషేధించలేదని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. పుస్తకాన్ని నిషేధించకుండా నాటాకాన్ని ఎలా నిషేధిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్య వైశ్యులు ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని కోర్టు ముందుంచాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ఇతర అధికారులు అందరూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.













