ఏపీ ప్రభుత్వానికి షాక్ …సీఐడీ కేసులో చంద్రబాబు, నారాయణకు ఊరట
రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నమోదు చేసిన కేసులో ఊరట లభించింది. సీఐడీ నమోదు చేసిన ఎప్ఐఆర్ను సవాల్ చేస్తూ చంద్రబాబు నాయుడు, నారాయణ ఉన్నత న్యాయస్థానంలో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ చేపట్టింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా, నారాయణ తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదాలు వినిపించారు. సీఐడీ తరపున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు చంద్రబాబు, నారాయణ కేసులో సీఐడీ విచారణపై స్టే విధించింది.













