ఏపీ పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వలేం
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు కొట్టివేసింది. ఈ పరిస్థితుల్లో స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీకి ఆదేశిస్తూ తదుపరి విచారనను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఈ పక్రియను వెంటనే నిలిపివేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని కోరుతూ ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రభుత్వం తరపున పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని, ఎస్ఈసీ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా ప్రకటన చేశారని పిటిషన్లో ఆక్షేపించారు. ఎస్ఈసీ ప్రకటన సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేదన్నారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటికే 6వేల మందికి పైగా మరణించారని, ఈ సమయంలో ప్రజారోగ్యం ప్రభుత్వ కర్తవ్యమని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తా•గా తీర్పు వెలువరించింది.













