వలసకూలీలకు అన్ని రకాలుగా అండ: ఎపీ ప్రభుత్వం
దేశ లాక్ డౌన్ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రమారమి లక్షన్నరకు పైగా వలస కార్మికులు చిక్కుకుపోయారని, అదీకాకుండా అనేకమంది పక్క రాష్ట్రాల నుండి నేషనల్ హైవే మీద నడుచుకుంటూ రాష్ట్రంలో ప్రవేశిస్తూన్నారని వీరికి అన్ని విధాలుగా ప్రభుత్వవం అండగా ఉంటుందని కోవిడ్ స్టేట్ కో ఆర్డినేటర్ క్రష్ణబాబు చెప్పారు. వలసకూలీలకు సంబంధించి ఎపీ తీసుకుంటున్న చర్యలను ఆయన ఇలా వివరించారు… సుదూర ప్రాంతాలైన బీహార్ పశ్చిమ బెంగాల్ అస్సాం జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం భారత రైల్వే వారి సహకారంతో ఇప్పటివరకు 30 శ్రామిక ప్రత్యేక రైళ్లను నడపడం జరిగింది. వీటి ద్వారా రమారమి 33000 మందిని వారి స్వస్థలాలకు చేర్చడం జరిగింది. ఇంకొక 40 వేల మంది వరకు వారి వారి గమ్యస్థానాలకు వెళ్ళవలసి ఉంటుంది.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రోడ్లపై నడుస్తున్న టువంటి వారందరిని ప్రత్యేక బస్సులో తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ షెల్టర్ హోమ్ కు తరలిస్తున్నారు. వీరందరినీ కూడా ఈ ప్రత్యేక శ్రామిక రైళ్లలో వారి వారి స్వస్థలాలకు పంపించడం జరుగుతుంది.ఇలా నిలిచిపోయిన వలస కార్మికుల యొక్క వివరములు తహశీల్దార్లు కు అందించగా వాటిని స్పందన వెబ్ సైట్ నందు వివరాలను అప్ లోడ్ చేయ డం జరుగుతుంది. వారందరికీ రైల్ మానిఫెస్ట్ జనరేట్ చేయడం జరుగుతుంది. వీరికి ముందుగానే వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. తదుపరి రైల్వే స్టేషన్ లో మరలా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి వారికి అవసర మైన భోజనం, త్రాగునీరు వారికి అందించడంతో పాటు తగు జాగ్రత్తలు తీసు కుంటూ పంపడం జరుగుతుంది. ఈ వలస కార్మికులను ప్రత్యేక బస్సులలో తీసుకొనివచ్చి జాగ్రత్తగా వారు చేరబోయే జిల్లా వారీగా శ్రామిక రైలులో S 1 నుండి S24 వరకు వారి వారి కోచ్ లకు చేర్చడం జరుగుతుంది.
ప్రతి జిల్లా యంత్రాంగం ప్రతి రైలు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ అనేక మంది వలస కార్మికులకు వారి వారి స్వస్థలాలకు చేరే విధంగా చక్కటి ప్రణాళికతో పని చేస్తున్నారు. వీరందరినీ తరలించడం వారికి అన్ని సదుపాయాలు కలిగించటం ట్రైన్ లో ఎక్కిం చడం వారికి జాగ్రత్తలు చెప్పడం సంతోషంతో వారికి వీడ్కోలు చేయటం ఒక కష్టతరమైన టువంటి ప్రక్రియ. దీనిని సిబ్బంది చాలా చాకచక్యంగా చేస్తున్నందుకు ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి అభినందనలు. అదేవిధంగా రైల్వే సిబ్బందికి పోలీస్ సిబ్బందికి జిల్లా సిబ్బందికి ఇంతటి చక్కటి కార్యక్రమం లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కమాండ్ కంట్రోల్ లో, సి ఎస్ గారు, డీజీపీ గారు కృష్ణ బాబు గారి ఆధ్వర్యంలో పని చేస్తున్నటువంటి వారందరి తరఫున, వలస కార్మికుల తరపున ధన్యవాదాలు. నిన్న మ.12 గంటలకు చిత్తూరు నుండి ఉత్తరప్రదేశ్ కు బయలుదేరిన ప్రత్యేక శ్రామి క్ రైలు కు కరతాళ ధ్వనుల తో జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా తో పాటు జేసి డి. మార్కండే యులు, జిల్లా కోవిడ్ – 19 నోడల్ అధికారి చంద్ర మౌళి, డి.యస్.పి లు ఈశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కలెక్టరేట్ ఏఓ గోపాలయ్య, సంబంధిత మండల తహశీల్దార్లు రైల్వే పోలీసులు, రెవెన్యూ అధికారులు వీడ్కోలు పలకడం ఆనందాన్ని అందించింది. సొంత రాష్ట్రానికి వెళ్లే ఆనం దం….తో పాటు ఉత్తర ప్రదేశ్ కు పంపేందుకు రాష్ట్ర ప్రభు త్వం తో పాటు జిల్లా యంత్రాంగం తీసుకొన్న చొరవ ను, వారికి అందించిన సౌకర్యాలకు మరియు సహాయ సహకారాలకు ఉతరప్రదేశ్ వలస కార్మికులు ఆనందంతో ధన్య వాదాలు తెలియ చేయడం ఒక చక్కటి అనుభూతి.






