బదిలీల కోసం ఎదురుచూస్తున్న.. ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో సాధారణ బదిలీలపై ఇప్పటివరకు నిషేధం కొనసాగుతూ వచ్చింది. ఆ నిషేధాన్ని సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతకం చేశారు. దీంతో ఉద్యోగుల సాధారణ బదిలీలపై అడ్డంకులు తొలిగిపోయినట్లు అయింది. దీంతో జూన్ 17లోపు బదిలీల ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయి మార్గదర్శకాలు వెలువడనున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి.













