జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను ఘనంగా సత్కరించిన ఏపీ ప్రభుత్వం
సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గౌరవార్ధం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన్ను ఏపీ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఈ విందులో గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. గతంలో ఏపీ హైకోర్టు జడ్జిగా సేవలందించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు.. ఇటీవలే సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్ లభించిన సంగతి తెలిసిందే. 1964 ఆగస్టు 29న ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌గఢ్‌లో ఆయన జన్మించారు. న్యాయవాద వృత్తిని చేపట్టిన ఆయన 2004 నుంచి 2007 వరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్‌గా సేవలందించారు. 2009లో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. 2021 జూన్ 1 నుంచి అదే కోర్టులో తాత్కాలిక సీజేఐగా పనిచేశారు. అనంతరం ఏపీ హైకోర్టు సీజేగా సేవలందించి, ఇటీవలే సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు.













