టీటీడీ ఈవో సింఘాల్ పదవీ కాలం పొడిగింపు
తిరుమల,తిరుపతి దేవస్థానం ఈవోగా పనిచేస్తున్న అనిల్‌కుమార్ సింఘాల్ పదవీకాలాన్ని పొడిగిస్తూ ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు ఈవోగా కొనసాగాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న సింఘాల్‌ను 2017 మేలో టీటీడీ 25వ ఈవోగా డిప్యూటేషన్‌పై బదిలీ చేశారు. రెండేళ్ల పాటు ఉండే ఈ పదవి కాలం పూర్తికావడంతో ఏపీ ప్రభుత్వం 2019లో మరో ఏడాది డిప్యూటేషన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా రెండోసారి డిప్యూటేషన్‌ను పొడిగింపు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ ఈవోగా కొనసాగాలని కోరింది.













