కరోనా ఎఫెక్ట్ తో పరీక్ష రాయకున్నా పాస్
కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తుండటం, దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉండటంతో 6 నుంచి 9 తరగతుల విద్యార్థుల కోసం ఆంధప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా తరగతుల విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు వెళ్లేలా అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి ఏ సురేష్ గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం శ్రేయస్కరం కాదని, అది విద్యార్థులకు, అధికారులకు కూడా ప్రమాదకరమని ఆయన తెలిపారు. ఇక ఇప్పటికే వాయిదా పడిన పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఈనెల 31న సమీక్ష నిర్వహిస్తామని, ఆ తర్వాతే కొత్త షెడ్యూల్ను విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు.













