ఏకగ్రీవాలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రోత్సాహాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. నజరానా మొత్తాలను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ఇస్తానన్న నజరానాలు ఇవ్వకుండా మోసం చేస్తోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగా 2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, 2 వేల నుండి 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 లక్షలు, 5 వేల నుండి 10 లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, 10 వేలకు పైచిలుకు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20 లక్షల వంతున నిధులు విడుదల చేయాలని నిర్ణయంచారు. ఆ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పంచాయతీల్లో పెండిరగ్ బిలుల్ల చెల్లింపు మార్గం సుగుమమైంది.













