IAS IPS: ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా యంత్రాంగంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లోని సీనియర్ అధికారులు, వివిధ శాఖాధిపతులు సహా కలెక్టర్లు, ఎస్పీల వరకు భారీస్థాయి లో బదిలీలకు రంగం సిద్ధమైంది. రెండు రోజుల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) దీనిపై కసరత్తు చేస్తున్నారు. ఆదివారం కూడా విస్తృతంగా చర్చించారు. జాబితా దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో జాబితాలు విడదుల కానున్నాయి. అధిక సంఖ్యలో సినియర్ అధికారులకు స్థానచలం కలిగే అవకాశం ఉంది. తొలి విడతలో వీరు పేర్లే వస్తాయి. తర్వాత శాఖాధిపతులు, కొందరు కలెక్టర్లు (Collectors) , ఎస్పీ (SP) ల బదిలీల ఉత్తర్వులు ఇస్తారు. విద్యుత్తు పంపిణీ సంస్థల్లోనూ బదిలీలు జరగనున్నాయి. కలెక్టర్ల పనితీరుపై ప్రభుత్వం ఇప్పటికే రెండు, మూడు విడతలుగా సమాచారం తెప్పించుకుంది. దాన్ని వడబోసి తుది జాబితా తయారు చేసినట్లు తెలిసింది.