కరోనా క్వారంటైన్ కిట్ ఇంటికే ఏపీ పభుత్వ కీలక నిర్ణయం..
కరోనా నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్నవారు బయటకు రాకుండా… వారికి కావాల్సిన అత్యవసరమైన వన్నీ వారి ఇళ్ల వద్దకే పంపించే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వం రూపొందించిన ఈ కరోనా హోమ్ క్వారంటైన్ కిట్ లో కరోనా మందులు, శానిటైజర్, మాస్క్ లు, గ్లౌజ్ లు, ఆక్సీమీటర్ ఉంటాయి. కరోనా తీవ్రత తక్కువగా ఉండి హోం క్వారంటైన్ లో ఉన్న వారికి ఈ కిట్ ను అందిస్తారు.. లక్షణాలు ఎక్కువగా ఉన్న వారిని హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తారు. హోం క్వారంటైన్ లో ఉన్నవారు మెడిసిన్స్, ఇతర సామగ్రి కోసం బయటకు వస్తే… ఇన్ఫెక్షన్ ఇతరులకు సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, వారికి అవసరమైన వాటిని కిట్ ద్వారా అందించే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అంతేకాకుండా స్వల్పలక్షణాలున్న వారు వెంటనే ఆసుపత్రులకు క్యూ కట్టకుండా ఈ ప్రయత్నం ఉపకరిస్తుందని ఆశిస్తున్నారు.













