Vivekananda Reddy: వివేకా హత్యకేసు సుప్రీంలో.. ఏపీ ప్రభుత్వం అదనపు అఫిడవిట్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Vivekananda Reddy) హత్య కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court) లో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. అఫిడవిట్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించింది. కృష్ణారెడ్డి (Krishna Reddy) ఫిర్యాదుపై జరిపిన దర్యాప్తు విషయాలతో విచారణాధికారి నివేదిక ఇచ్చారు. పులివెందుల కోర్టుకు ఇచ్చిన నివేదికను జత చేసి ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు అవినాష్‌రెడ్డి ప్రయత్నించారు. సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిని ఈ కేసులో ఇరికించాలని చూశారు. అందులో భాగంగా సీబీఐ అధికారి రామ్‌సింగ్, సునీత (Sunitha), నర్రెడ్డి (Nar Reddy) , రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు అని అఫిడవిట్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.













