ఏపీలో తక్కువ రకం మద్యం ధరల తగ్గింపు..
మద్యం మాఫియా ఊపందుకోవడంతో పాటు ఇటీవల శానిటైజర్ తాగి పదుల సంఖ్యలో మందుబాబులు చనిపోయిన సంఘటనల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ధరలను సవరిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం తక్కువ రకం బ్రాండ్ మద్యం ధరలు తగ్గాయి. ఐఎంఎఫ్ లిక్కర్, ఫారెన్ లిక్కర్, బీర్, వైన్ ధరల్లో మార్పులు చేసింది. రూ.150 కంటే తక్కువ ధర ఉన్న మద్యం ధరలను తగ్గించారు. 90ఎంఎల్ రూ.190 నుంచి రూ.600 వరకు ఉన్న మద్యంపై ధరలను పెంచారు. బీర్లు, రెడీ టు డ్రింక్ ధరలు తగ్గించారు. అన్ని రకాల బ్రాండ్స్ బీర్లపై రూ.30 వరకూ తగ్గింపు వర్తింపజేశారు. ఈ మార్పులతో తక్కువ రకం మద్యం ధరలు తెలంగాణ రాష్ట్రంలో కన్నా తమ దగ్గర తక్కువగా ఉన్నాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.













