మార్చిలో ఏపీ ఎన్నికల నోటిఫికేషన్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ ఎన్నికల నిర్వహణకు మార్చిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా తెలిపారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,02,21,450. దీనికి సంబంధించి ముసాయిదా జాబితాను మీనా విడుదల చేశారు. డిసెంబరు 9 వరకు ఎవరైనా తమ అభ్యంతరాలు తెలియజేయవచ్చని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 10 లక్షల బోగస్ ఓట్లను గుర్తించి తొలగించామని వెల్లడిరచారు. ఓటరుగా నమోదయ్యేందుకు డిసెంబరు 9 వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది. ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అని తెలిపారు.













