విద్య, వైద్య రంగాలకు సీఎం అధిక ప్రాధాన్యత : మంత్రి బొత్స
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు ముఖ్యమంత్రి జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వియవాడలోని రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు త్వరలోనే పరిష్కారిస్తామన్నారు. విద్యార్థుల యూనిఫామ్‌లో త్వరలో మార్పులు వస్తాయని తెలిపారు. విద్యార్థులు హుందాగా ఉండేలా యూనిఫామ్ రూపొందిస్తామన్నారు. ప్రతి తరగతి గదిలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తామని వెల్లడిరచారు. ఢల్లీి కంటే ఎక్కువగా విద్యారంగంలో సౌకర్యాలు అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిషేధిస్తున్నామని, దీనిపై పాఠశాల నుంచే అవగాహన కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అధ్యాపకులకు చెప్పాలని సూచించారు.













