ప్రభుత్వ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
– ముస్లిం సోదరుల దగ్గర ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.
– దేవుడు ఎంత గొప్పగా పని చేస్తాడు, స్క్రిప్ట్ రాస్తాడు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు.
– గత ఎన్నికల్లో 67 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే, వారిలో 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారు.
– వారిలో నలుగురిని మంత్రులుగా కూడా చేశారు.
– నిజానికి ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారితే వారిని అనర్హులను చేయాలి. లేదా రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలి. కానీ చంద్రబాబు పాలనలో అది జరగలేదు.
– అదే విధంగా పార్టీకి చెందిన 9 మంది ఎంపీలు ఉంటే, వారిలో ముగ్గురిని కొనుగోలు చేశారు.
– దేవుడు స్క్రిప్ట్ రాస్తే, ఎలా ఉంటుందో తెలుసా!.
– పవిత్ర రంజాన్ మాసంలోనే ఎన్నికల ఫలితాలు వచ్చాయి.
– అది కూడా 23వ తేదీనే. మా పార్టీ నుంచి టీడీపీ కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా సరిగ్గా 23. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ గెల్చింది కూడా కేవలం 23 స్థానాలు మాత్రమే.
– అదే విధంగా మా పార్టీ నుంచి ముగ్గురు ఎంపీలను టీడీపీ కొనుగోలు చేసింది.
– ఈ ఎన్నికల్లో ఆ పార్టీ గెల్చుకుంది కూడా కేవలం మూడు ఎంపీ సీట్లు మాత్రమే.
– దేవుడు స్క్రిప్ట్ రాస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది?
– నాన్నగారి తరహాలో మీ అందరికీ మేలు చేస్తాను. మంచి చేస్తాను. మహానేత వైయస్సార్ కంటే ఇంకా మంచి పాలన అందించడానికి ప్రయత్నిస్తాను.
– ఈ ఎన్నికల్లో ముస్లింలలో 5 గురికి టికెట్ ఇస్తే, నలుగురు గెల్చారు. ఒక్క ఇక్బాల్ మాత్రమే ఓడిపోయారు.
– కాబట్టి ఆయనను వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించుకుంటాను. ఆ విధంగా ఆయనను కూడా చట్టసభలో కూర్చోబెడతాను.













