కేంద్ర మంత్రులతో భేటీ అయిన సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో మొదటగా భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులు, తదితర అంశాలపై జవదేకర్‌తో సీఎం జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. తర్వాత కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సీఎం జగన్ ఆయనకు వివరించారు. అంతేకాకుండా ప్రాజెక్టు బకాయిల అంశాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ వెంట సీఎస్ ఆదిత్యనాథ్, ఎంపీలు మిథున్, అవినాష్ రెడ్డి, బాలశౌరి తదితరులు ఉన్నారు. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రితో సీఎం జగన్ భేటీ కానున్నారు.