GFST: టూరిజం కాంక్లేవ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ఏపీలో పర్యాటక రంగానికి సరికొత్త ఉత్తేజం ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. విజయవాడలో ఈ రోజు టూరిజం కాన్క్లేవ్ను ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు (Chandrababu) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు పర్యాటక క్యారవాన్లను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే ఈ కాన్క్లేవ్ ముఖ్య ఉద్దేశం. ఈ నిర్ణయం ద్వారా పర్యాటక రంగంలో పరిశ్రమలకు లభించే అన్ని రకాల ప్రోత్సాహకాలు, రాయితీలు వర్తించనున్నాయి.













