పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు
ఎన్నికల పోలింగ్ అనంతరం తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. స్పిల్వే, కాపర్ డ్యామ్ పనులను పరిశీలించారు. పోలవరం వ్యూ పాయింట్ నుంచి పనులు పరిశీలించారు. పోలవరం మెయిన్ డ్యామ్ వద్ద గేట్ల బిగింపు పనులపై ఆరా తీశారు. వీలైనంత త్వరగా మిగిలిన గేట్ల బిగింపు పనులు పూర్తి చేయాలని చంద్రబాబు సూచించారు. స్పిల్వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులను స్వయంగా పరిశీలిచారు. అనంతరం కాంట్రాక్టు ఏజెన్సీలు, ఇంజనీర్లతో సమీక్షించారు. కేంద్ర నుంచి రావాల్సిన నిధులపైనా చర్చించినట్లు సమాచారం.













