తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు కుటుంబం
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాన్ష్, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణతో కలిసి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న చంద్రబాబుకు అర్చకులు ఇస్తకఫాల్ స్వాగతం పలికారు. అనంతరం వారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 నుంచి స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఈ రోజు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు కావడంతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తకోటికి ఒకరోజు అన్న ప్రసాదాల వితరణకు అయ్యే ఖర్చు మొత్తం రూ.26 లక్షలను దేవాన్ష్ పేరిట తిరుమల తిరుపతి దేవస్థానంకు విరాళంగా ఇచ్చారు.













