సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జులై 4న ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన హస్తిన పర్యటనకు వెళ్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు నేతలతో భేటీ అయ్యే అకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్రం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు, కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి గతంలో రావాల్సిన నిధులు, కొత్తగా తెచ్చుకోవాల్సిన పథకాలపై నిర్మలా సీతారామన్‌తో చర్చించే అవకాశం ఉంది. గత ప్రభుత్వ తీసుకున్న అప్పుల నుంచి తేరుకొనేందుకు కేంద్రం నుంచి అవసరమైన మద్దతును కోరవడంతో పాటు రాష్ట్రానికి విరివిగా నిధులు అందించి అమరావతి, పోలవరం నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరించాలని కోరుకున్నట్లు సమచారం. ఈ సందర్భంగా సీఎం అయ్యాక తొలిసారి వెళ్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీని సైతం కలిసే అవకాశం కూడా ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.













