20న ఏపీ కేబినెట్ సమావేశం
ఈ నెల 20వ తేదీన ఆంధప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో అదే రోజు ఉదయం 8:30 గంటకు సచివాలయంలో మంత్రి మండలి సమావేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టి 2021-22 బడ్జెట్ ముందుగా కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందనుంది. అనంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే సమావేశంలో కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించనున్నారు.













