AP Cabinet: ఏపీ మంత్రివర్గ సమావేశం … కీలక అంశాలకు ఆమోదం
ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన సచివాలయం (Secretariat) లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet meeting) ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్‌ను (ఏపీడీసీ) ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ ( ఏపీఎస్ఎఫ్ఎల్) నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది.
ఆమోదం పొందిన అంశాలు :
అనకాపల్లి జిల్లాలోని డీఎల్‌పురం వద్ద క్యాపిటివ్ పోర్టు (Captive port) ఏర్పాటుకు ఆమోదం.
త్రీ స్టార్, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునకు ఆమోదం. బార్ లైసెన్స్‌ల ఫీజును రూ.25 లక్షలకు కుదిస్తూ ఆమోదం.
యువజన, పర్యాటక శాఖ జీవోల ర్యాటిఫికేషన్‌కు ఆమోదం.
రూ.710 కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదం.
ఏపీ మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు -2025కి ఆమోదం.
నాగార్జునసాగర్ (Nagarjunasagar) లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం.
జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం. జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన.













