AP Cabinet: పలు కీలక బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ (AP Cabinet) సమావేశం జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ఇతర మంంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో (AP Cabinet) పలు కీలక బిల్లులు, ప్రతిపాదనల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రైవేటు వర్సిటీల చట్ట సవరణ బిల్లుపై ఉన్నత విద్యాశాఖ కొన్ని ప్రతిపాదనలు చేయగా.. వాటికి కేబినెట్ (AP Cabinet) ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలకు కూడా కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వైద్య ఆరోగ్య శాఖలో ప్రతిపాదనలకు కూడా పచ్చజెండా ఊపిన కేబినెట్.. 372 సివిల్ సర్జన్ పోస్టులు భర్తీ చేయాలనే వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం (AP Cabinet) ఆమోదం తెలిపింది.ఇక, మద్యం దుకాణాల్లో సొండి కులాలకు 4 దుకాణాలు కేటాయించాలన్న నిర్ణయానికి, కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం (AP Cabinet) ఆమోదం లభించింది.













