Ap Cabinet: ఏపీ కేబినెట్ భేటీ… వారికి ఉచిత విద్యుత్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు రాష్ట్ర కేబినెట్ (Cabinet) ఆమోదం తెలిపింది. సచివాయంలో చంద్రబాబు (Chandrababu ) అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల (Teachers) బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. రాజధాని అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం లభించింది. ఎస్సీ వర్గీకరణ (SC classification) అంశంపైనా కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఈ అంశంపై ఇటీవల రాజీవ్‌రంజన్ మిశ్రా (Rajiv Ranjan Mishra) కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కేబినెట్ నిర్ణయాలు …
సంబూరులో వీవీఐటీయూకు ప్రైవేటు యూనివర్సిటీ హోదా కల్పిస్తూ నిర్ణయం.
అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం.
పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం పచ్చజెండా.
వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరు ఇకపై తాడిగడప మున్సిపాలిటీగా మార్పు చేస్తూ కేబినెట్ నిర్ణయం.
ముఖ్యమంత్రి కార్యాలయంలో ముగ్గురు ఫొటోగ్రాఫర్లు, వీడియోగాఫ్రర్ల పోస్టులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.













