5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ప్రస్తుత అసెంబ్లీ చివరి సమావేశాలు వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరొజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగిశాక, శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ సమావేశాల ఎజెండాను ఖరారు చేయనుంది. సమావేశాలు 5 రోజులపాటు నిర్వహించనున్నారు. 7 లేదా 8న రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఫిబ్రవరి 8 నుంచే రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. ఈ సందర్భంగా తమ పార్టీ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించేందుకు అధికార వైసీపీ సన్నద్ధమవుతోంది.













