టీటీడీ ఎక్స్ అపీషియో సభ్యునిగా అనిల్ కుమార్ సింఘాల్ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి వీరిచేత ప్రమాణం చేయించారు. రంగనాయకుల మండలపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం అదనపు ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, కాపి టేబుల్ బుక్ అందించారు. ఈ కార్యక్రమంలో జేఈవో సదాభార్గవి, డిప్యూటీ ఈవోలు రమేష్ బాబు, కస్తూరిబాయి, విజివో బాలిరెడ్డి, ఫేష్కార్ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు.













