ఏపీలో కొలువుదీరిన కొత్త పాలక మండళ్లు
ఏపీలోని 11 నగరపాలక సంస్థలు, 75 మున్సిపాలిటీల్లో కొత్త పాలక మండళ్ల ప్రమాణ స్వీకారం పూర్తైంది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరిగింది. 9 ఏళ్ల తర్వాత గ్రేటర్ విశాఖ పాలక మండలి కొలువుదీరడం విశేషం.
మేయర్లు, డిప్యూటీ మేయర్ల జాబితా……..
విశాఖపట్నం :
మేయర్ – హరి వెంకట కుమారి
డిప్యూటీ మేయర్ : జియ్యాని శ్రీధర్
విజయవాడ :
మేయర్ : భాగ్యలక్ష్మి
డిప్యూటీ మేయర్ : బెల్లం దుర్గ
విజయనగరం :
మేయర్ : విజయలక్ష్మి
డిప్యూటీ మేయర్ : ముచ్చు నాగలక్ష్మి
మచిలిపట్నం :
మేయర్ : మోకా వెంకటేశ్వరమ్మ
డిప్యూటీ మేయర్ : లంకా సూరిబాబు, తంటిపూడి కవిత, శీలం భారతి, మాడపాటి వెంకటేశ్వరమ్మ
తిరుపతి :
మేయర్ : శిరీషా (ఏకగ్రీవం)
డిప్యూటీ మేయర్ : ముద్ర నారాయణ
చిత్తూరు :
మేయర్ : అముద
డిప్యూటీ మేయర్ : చంద్రశేఖర్
గుంటూరు :
మేయర్ : కావటి మనోహర్ నాయుడు
డిప్యూటీ మేయర్ : వనమా బాలవజ్ర బాబు
ప్రకాశం :
ఒంగోలు మేయర్ : గంగాడ సుజాత
డిప్యూటీ మేయర్ : వేమూరి సూర్యనారాయణ
కడప :
మేయర్ : సురేష్ బాబు (ఏకగ్రీవం)
డిప్యూటీ మేయర్ : ముంతాజ్ బేగం
అనంతపురం :
మేయర్ : వసీం సలీం
డిప్యూటీ : దాసరి వాసంతి సాహిత్య













