ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం… ప్రతి నియోజకవర్గంలో
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ వైద్య సేవల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. నియోజకవర్గ కేంద్రాల్లో కాలేజీలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. రోజుకు 12 వేల రెమిడెసివర్ ఇంజక్షన్లు రప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 40 పడకల ఆస్పత్రులను కోవిడ్ హాస్పిటల్స్‌గా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, నివారణకు అది నుంచి పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఈ పక్రియలో మరో ముందడుగు వేసింది.













