ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు… రాగానే పంపిణీ

కరోనా నివారణ కోసం తాను పంపిణీ చేస్తున్న ఔషధానికి ఇంకా ప్రభుత్వ అనుమతులు రాలేదని ఆనందయ్య స్పష్టం చేశారు. మందు పంపిణీ చేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో (టీవీ, వాట్సాప్) వస్తోన్న వార్తలు అవాస్తవమన్నారు. వదంతులు నమ్మి ఎవరూ కృష్ణపట్నానికి రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఔషధ తయారీకి అవసరమైన ముడి పదార్థాలు సిద్ధంగా లేవని చెప్పారు. ప్రభుత్వ అనుమతి రాగానే మందు తయారు చేసి అందరికి అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పారు. ముందుగానే తాను ప్రకటన చేసి అందరికి మందు పంపిణీ చేస్తానని ఆయన వెల్లడించారు.