త్వరలో ఆన్‍లైన్ ద్వారా… ఆనందయ్య మందు

ఆనందయ్య కరోనా మందుకు ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పంపిణీ విధానంపై నెల్లూరు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులు సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ ముడిసరుకు సమీకరించి, నాలుగైదు రోజుల్లో మందు పంపిణీ ప్రారంభిస్తామని వెల్లడించారు. వికేంద్రీకరణ, ఆన్‍లైన్ విధానం ద్వారానే మందు పంపిణీ జరుగుతుందని అన్నారు. నేరుగా ఇతర ప్రాంతాల వారు ఎవ్వరూ మందు కోసం రావొద్దని సూచించారు. అవసరమైన ప్రాంతాలకు తాము మందు పంపిణీ చేస్తామని వెల్లడించారు. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉన్నందున కోర్టు తీర్పు, ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి చర్యలు చేపడతామన్నారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సూచించిన ప్రాంతంలో మందు తయారీ చేపడతామన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ భాస్కర్ భూషణ్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్దన్‍రెడ్డితో పాటు ఆనందయ్య హాజరయ్యారు.