తాము తెలుగుదేశం పార్టీలోనే
తాము తెలుగుదేశం పార్టీలోనే ఉంటామని అదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సృష్టం చేశామని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానందరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనం భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము తెలుగుదేశం పార్టీని వీడనున్నామని సోషల్మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తమని అన్నారు. తమ సేవలు ఎలా వినియోగించుకోవాలో చంద్రబాబుకు తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో తమకిచ్చే స్థానంలో గెలిస్తామని దీమా వ్యక్తం చేశారు.ఆత్మకూరులో టీడీపీ జెండా ఎగురువేసిన తర్వాతే లుస్తామని ముఖ్యమంత్రికి చెప్పామని అన్నారు. వ్యవసాయం అంటే ఏమిటో తెలియని వైస్ జగన్ దీక్షల పేరుతో నాటకాలాడుతున్నారని విమర్శించారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు మిర్చిరైతుల కళ్లల్లో కారం చల్లారని ఆరోపించారు. మిర్చి రైతులపై జగన్ దొంగ ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు.













