చంద్రబాబుతో అమిత్ షా భేటీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ( సంస్థాగత) బీఎల్ సంతోష్‌లకు చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గం కూర్పు, బీజేపీ నుంచి ఎవరెవరికి చోటు కల్పించాలి తదితర అంశాలపై చర్చించారు. అంతకుముందు విమానాశ్రయంలో అమిత్ షా, నడ్డాలకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్వాగతం పలికారు.













