అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం.. కొత్త చట్టాలు
అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువస్తాం అనటం రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపై ప్రత్యక్షంగా బురద చల్లటం కోసం అమరావతి రాజధాని విషయంలో జగన్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతుల పోరాటంపై త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును వైసీపీ ప్రభుత్వం అవమానపరుస్తుందన్నారు. శాసనాలను భంగపరిచే విధంగా కోర్టు ఆదేశాలు రాలేదని ఆయన పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలు సీఎం జగన్ రెడ్డి విస్మరించి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాలన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను ఇబ్బందులు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు కనబడుతుందన్నారు. కోర్టులు పరిపాలనలో జోక్యం చేసుకోవడం సరికాదని ముఖ్యమంత్రి అనటం కూడా రాజ్యాంగ విరుద్ధమన్నారు.













