వైఎస్ వల్లే కాలేదు.. ఈ సీఎం వల్ల ఏమవుతుంది?
కేసుల విచారణకు సహకరించి ముఖ్యమంత్రి జగన్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని మాజీ మంత్రి ఆలపాటి రాజా డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా రాజా మీడియాతో మాట్లాడుతూ చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏదో అవినీతి జరిగిందని వేసిన కేసును చూసి న్యాయ నిపుణులే ఆశ్చర్యపోతున్నారన్నారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సీబీఐ వస్తే అడ్డుకోలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పు చేశారని నిరూపించడం వైఎస్ వల్లే కాలేదు. ఈ సీఎం వల్ల ఏమవుతుంది? అని ప్రశ్నించారు. తనపై పెద్ద ఎత్తున కేసులున్నా కోర్టుకు వెళ్లకుండా జగన్ కాలయాపన చేస్తున్నారు. కోర్టుకెళ్లేందుకు సమయమే లేదంట. అక్రమ కేసులు వేస్తే దొర దొంగ అవడు, దొంగ దొర కాలేడు అని విమర్శించారు.













