ఎవరి సొమ్ముతో రైతు దినోత్సవం : ఆలపాటి
ప్రభుత్వం తీరుపై తెలుగుదేశం పార్టీ నేత ఆలపాటి రాజా తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు దినోత్సవం ఎవరి సొమ్ముతో చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ సొమ్ముతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విపక్ష ఎమ్మెల్యేలు రాకుండా ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. రైతు రాజ్యం తెస్తామన్న జగన్ వారికి మేలు చేసే విధంగా ఒక్క ప్రకటన కూడా చేయలేదన్నారు. కళ్యాణ మిత్ర, రుణమాఫీ పథకాలను ఎందుకు ఆపేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆదర్శాలు వల్లే వేస్తున్నారే తప్ప… ఆచరణలో మాత్రం చూపడంలేదని దుయ్యబట్టారు.













