విశాఖ నుంచి ముంబైకి రాత్రి విమానం
విశాఖపట్నం నుంచి ముంబైకి ఎయిరిండియా రాత్రి బాగా పొద్దు పోయిన తర్వాత విమాన సర్వీసును ప్రారంభించింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా విమానం మధ్యాహ్నం 2:15 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి సాయంత్రం 4:20 గంటలకు ముంబై చేరుకుంటోంది. వ్యాపారులకు అనుకూలంగా వుండేలా రాత్రి తొమ్మిది గంటల తరువాత ఒక సర్వీసు వుంటే బాగుంటుందని ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఎయిరిండియా డైరెక్టర్ దగ్గుబాటి పురందేశ్వరికి వినతిపత్రం సమర్పించారు. దాన్ని పురస్కరించుకుని ఆమె ఎయిరిండియా యాజామాన్యంతో చర్చించే ఈ లేట్‌నైట్ సర్వీసుకు ఒప్పించారు. ఈ సర్వీసు విశాఖపట్నంలో రాత్రి 9:30 గంటలకు బయలుదేరి 11:40 గంటలకు ముంబై చేరుతుంది.













