రాబోయే ఎన్నికల్లోనూ టీడీపీకి ఇదే పరిస్థితి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక జరిగినా తెలుగుదేశం పార్టీకి దారుణ పరాభావం తప్పదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించడం, టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట కుప్పం మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ దారణంగా ఓటమి చెందడంతో ఎన్నికల ఫలితాలపై మంత్రి స్పందించారు. కుప్పం మా అడ్డా అని గొంతు చించుకున్న బాబూ, కొడుకు ఇప్పుడేమంటారని ఆయన ప్రశ్నించారు. దొంగ ఓట్లు అన్నారు. కౌంటింగ్ రికార్డు చేయాలన్నారు. అధికారులకు ఫిర్యాదులు చేస్తూ గగ్గోలు పెట్టారన్నారు. ఇన్ని చేసినా ప్రజా తీర్పును మార్చలేరుగా అని పేర్కొన్నారు.













