అమెరికాలోని అన్ లాగ్ లో ఇంటర్న్‌షిప్ కు ఎంపికైన ఏపీ విద్యార్థులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ఐటీకి చెందిన ఈసీఈ ఆఖరి సంవత్సరం విద్యార్థులు తొమ్మిది మంది అమెరికన్ బహుళ జాతి సెమీ కండక్టర్ కంపెనీ అయిన అన్‌లాగ్ డివైజెస్‌కి ఎంపికయ్యారు. ఆ సంస్థ ప్రతినిధులు ట్రిపుల్‌ఐటీలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించి ఆప్టిట్యూడ్, టెక్నికల్ పరీక్షల అనంతరం తొమ్మిది మంది విద్యార్థులను ఏడాదిపాటు లాంగ్‌టర్మ్ ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేశారు. ఇంటర్న్‌షిప్ సమయంలో ఈ విద్యార్థులకు నెలకు రూ.40 వేల చొప్పున స్టయిఫండ్ ఇస్తారు. ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత వారి పనితీరు ఆధారంగా విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.













