ఆరేళ్ల బాలుడు అరుదైన రికార్డు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడు నాదెళ్ల దియాన్స్ అరుదైన రికార్డును సంపాదించాడు. కానురులో ఒకటో తరగతి చదువుతున్న ఆరు సంవత్సరాల నాలుగు నెలలు ఉన్న దియాన్ష్ 128 దేశాల యొక్క జాతీయ జెండాలను చూసి 2 నిమిషాల 25 సెకండ్లలో గుర్తించాడు. ఆ బాలుడి ప్రతిభను 2023 జనవరి 12న జరిగిన ఆన్లైన్ పరీక్షలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. అనంతరం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తరపున అభినందన పత్రం, మెడల్, గత సంవత్సరం బుక్స్ పంపారు. తల్లిదండ్రులు గౌతమ్ కృష్ణ, ప్రియాంకలు, స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్, బంధువులు అభినందించారు. దియాన్స్ను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు కూడా అభినందించారు. ఇప్పుడు 135 దేశాలలోని జాతీయ జెండాలను గుర్తిస్తున్నాడని వారి తల్లిదండ్రులు తెలిపారు. ఇలాగే ప్రతి విద్యార్థి తమలోని ప్రతిభను పెంపొందించుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలని రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.













