కాబోయే అల్లుడికి కనులుచెదిరే విందు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాబోయే అల్లుడ్ని అత్తవారు పండగకు పిలిచి, 125 రకాల వంటకాలతో విందు భోజనం పెట్టారు. విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణానికి చెందిన కాపుగంటి రామకృష్ణ, సుబ్బలక్ష్మి దంపతుల కుమారుడు చైతన్యకు విశాఖకు చెందిన కలగర్ల శ్రీనివాస్‌రావు, ధనలక్ష్మి దంపతుల కుమార్తె నిహారికతో వచ్చే ఏడాది మార్చి 9న వివాహం చేయాలని నిర్ణయించారు. నిశ్చితార్థం అయ్యాక తొలి పండగ దసరాకు అత్తవారు అల్లుడ్ని ఆహ్వానించి రకరకాల వంటకాలతో విందిచ్చారు. 95 వరకు బయట నుంచి కొన్ని.. మిగతావన్నీ ఇంట్లోనే తయారు చేశారు. అన్ని వంటకాలు చూసిన ఆ అల్లుడు వాటిలో కొన్నింటి తెలియవని ఆశ్చర్యపోయారు.













