ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా రిలయన్స్ అధినేత
జియోలో ఫేస్బుక్ పెట్టుబడులతో ముకేశ్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా చోటు సంపాదించారు. బ్లూమ్బర్గ్ ఆసియా కోటీశ్వరుల జాబితాలో ఇప్పటి వరకు ప్రథమ స్థానంలో ఉన్న ఆలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా స్థానాన్ని ముకేశ్ అధిగమించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనంవతుల జాబితాలో ముకేశ్ అంబానీ 17వ స్థానంలో ఉండగా, జాక్ మా 19వ స్థానంలో నిలిచారు. రిలయన్స్ అనుబంధ సంస్థ జియోలో 9.99 శాతం వాటాను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కొనుగోలు చేసింది. దీంతో అంబానీ సంపద 4.7 బిలియన్ డాలర్లు పెరిగి ఒకేసారి 49.2 బిలియన్ డాలర్లకు చేరింది.













