ఈ నెల 23న ప్రణబ్‌కు వీడ్కోలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఎంపీలు ఈ నెల 23న సంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలకనున్నారు. ఇందుకోసం పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. అందులో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వీడ్కోలు ప్రసంగం చేస్తారు. కార్యక్రమంలో భాగంగా ప్రణబ్‌కు ఓ జ్ఞాపికతోపాటు లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలంతా సంతకం చేసిన పుస్తకాన్ని బహుకరిస్తారు. అనంతరం సెంట్రల్ హాల్ ఆవరణలో తన గౌరవారం ఏర్పాటుచేయనున్న తేనీటి విందులో ప్రణబ్ పాల్గొంటారని సమాచారం. రాష్ట్రపతిగా ప్రణబ్ పదవీకాలం ఈ నెల 25తో ముగియనుంది.













