సబర్మతి ఆశ్రమంలో నిన్న మోదీ చేసిన పనినే.. ఈ రోజు మీరాకుమార్ చేశారు!
ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటనలో భాగంగా సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆశ్రమంలోని చరఖాను తిప్పారు. అయితే ఇలాంటి సంఘటనే మరోకటి చోటు చేసుకుంది. ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన మీరా కుమార్ కూడా సబర్మతి ఆశ్రమంలో చరఖా తిప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిగా తన ప్రచారాన్ని ప్రారంభించిన మీరా కుమార్ దాదాపు 40 నిమిషాల పాటు ఆశ్రమంలో ఉన్నారు. మహాత్మాగాంధీ నుంచి స్ఫూర్తిని పొందడానికే తాను ఇక్కడకు వచ్చానని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. ప్రస్తుతం జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల ఇద్దరు దళిత వ్యక్తుల మధ్య పోరాటం కాదని, సిద్ధాంతాల మధ్య పోరు అని మీరా కుమార్ అన్నారు.













