తెలుగురాష్ట్రాల్లో కూడా పాత్రికేయులకు ఇలాంటి చట్టం …
మహారాష్ట్రలో పాత్రికేయులు మరియు మీడియా సంస్థల భద్రత కోసం ‘మీడియా ప్రొటెక్షన్ బిల్ ను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించింది. ఈ చట్టం ప్రకారండ మహారాష్ట్రలో పాత్రికేయుల మీద దాడి చేసినా, సదరు మీడియా సంస్థలపై దాడి చేసి వారి ఆస్తులకు నష్టం చేకూర్చినా రూ.50,000ల జరిమానా, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్, నేరం రుజువైతే 3 సంవత్సరాల కారాగార శిక్ష పడుతుంది. అలాగే నేరస్తుల నుంచి నష్ట పరిహారం, బాధిత పాత్రికేయునికి వైద్య ఖర్చులు తిరిగి వసూలు చేయబడతాయి. ఈ బిల్లులో విలేకరులు, ప్రతినిధులు, సంపాదకులు, ఉప సంపాదకులు, వార్త సంపాదకులు, ఫీచర్ రైటర్స్, ప్రూఫ్ రీడర్స్, కాపీ రైటర్స్, కార్టూనిస్ట్ మరియు కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లను చేర్చారు. అలాగే సంస్థలకు సంబంధించి వార్త ఛానళ్ళు, వార్తల ఆధారిత ఎలక్ట్రానిక్ ఛానళ్ళు, ప్రింటింగ్స్ ప్రెస్ లు, మీడియాకు సంబంధించిన ఆస్తులు చేర్చారు. ఇటువంటి చట్టం తెలుగురాష్ట్రాల్లో కూడా రావాలని కోరుకుందాం.













