లోక్సభ, రాజ్యసభలో మళ్లీ అదే దృశ్యం
లోక్సభ, రాజ్యసభలో మళ్లీ అదే దృశ్యం పునరావృతమైంది. మంగళవారం ఉదయం ప్రారంభమైన లోక్సభలో యదావిధిగానే అన్నాడీఎంకే సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ మొదలైన కొద్దిసేపటికే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అనంతరం 12 గంటల తర్వాత మళ్లీ ప్రారంభమైన లోక్సభలో మళ్లీ అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగడంతో సభను రేపటికి వాయిదా వేశారు. ఇక రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది. సభలో నూతనంగా ఎన్నికైన పలువురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.













