కుమారస్వామి సర్కారు కుప్పకూలింది
కర్నాటక అసెంబ్లీలో బలపరీక్షలో మ్యాజిక్ ఫిగర్ 103 కాగా సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా 99 మంది శాసనసభ్యులు ఓటు వేయగా వ్యతిరేకంగా 105 మంది ఓటు వేశారు. దీంతో కుమార స్వామి సార్కార్ కుప్పకూలింది. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి రాజీనామా చేశారు. సభలో మెజారిటీ నిరూపించుకోలేని కుమారస్వామి గవర్నర్కు రాజీనామా లేఖను సమర్పించారు. రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. 14 నెలల పాటు అధికారంలో కొనసాగింది సంకీర్ణ సర్కార్. మే 23 2018న ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. రెండు వారాల పాటు సంకీర్ణ ప్రభుత్వం తన ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ బలపరీక్షలో మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసేందుకు కుమారస్వామి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించకపోవడంతో ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో ఇన్నాళ్లు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. గవర్నర్కు రాజీనామ ఇచ్చిన ఆయన ఏనిర్ణయం తీసుకుంటాడో చూడాలి మరి.













