బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి చేరుకున్న పార్టీ ముఖ్య నాయకులు నడ్డాను అధ్యక్షుడిగా ప్రతిపాదించారు. దీంతో ఆయన ఎలాంటి పోటీ లేకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు సీనియర్ నాయకులు రాధామోహన్‌సింగ్ అధికారికంగా ప్రకటించారుర. గతంలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సేవలందించిన నడ్డా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పార్టీ నేతలు అమిత్ షా సహా తదితర ముఖ్య నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన నడ్డా గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఆ తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రిగానూ పలు పదవుల్లో పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఆయన బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం నడ్డా బీజేపీ కార్యనిర్వాహఖ అధ్యక్షుడిగా విధుల్ని నిర్వహిస్తున్నారు.













